• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి’

ASF: కాగజ్ నగర్‌లో ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు గత నెల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని MRO మధుకర్ శుక్రవారం కోరారు. తమ వారసులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు వివరాలు సేకరించి సంబంధిత BLOలకు అందజేయాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 10:35 AM IST

కులవర్ధన్ తల్లికి షాక్

KDP: మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై కులవర్ధన్ హత్యాచారం చేయడం తెలిసిందే. ఆ కేసులో నిందితుడి తల్లి అంజలి A2గా మారింది. కాగా ఆమె వెంకటేశ్వరపురం స్కూల్లో ఆయాగా పనిచేసేది. నిందితురాలిగా ఉన్న ఆమెను ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ హెచ్ఎం రమణమ్మ అంజలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.

February 20, 2026 / 10:34 AM IST

మహిళ కడుపులో 8 కిలోల కణితి తొలగింపు

ELR: జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స గురువారం జరిగింది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉన్నట్లు వైద్యుడు సంకు మురళి గుర్తించారు. ల్యాపరో స్కోప్ ద్వారా ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగించామన్నారు. కడుపు నొప్పితో సదరు మహిళా ఆసుపత్రికి వచ్చిందని, ఆపరేషన్ అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

February 20, 2026 / 10:32 AM IST

న్యాయవాది సూర్యం మృతికి గాండ్ల సురేష్ నివాళి

BDK: మణుగూరు మండలం రాజుపేట గ్రామానికి చెందిన న్యాయవాది పగిడిపల్లి సూర్యం అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ సూర్యం భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 10:32 AM IST

జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

GNTR: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి లోని ఆయన నివాసంలో కలిశారు. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, ఇంటిపై జరిగిన దాడి, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను అంబటి రాంబాబు జగన్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.

February 20, 2026 / 10:31 AM IST

రేపటి నుంచి సెలవుపై వెళ్లనున్న JC

ASR: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి, ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఇటీవల ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మను, పీవో శ్రీపూజ విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న వివాహ వేడుక జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 28 వరకు పీవో సెలవుపై వెళ్లనున్నారు.

February 20, 2026 / 10:31 AM IST

పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగుతాయి.

February 20, 2026 / 10:31 AM IST

‘ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్ రిహన కమల్ పాషాని శుక్రవారం సత్తుపల్లిలో 5 వ వార్డ్ కౌన్సిలర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ దృష్టికి సమస్య వచ్చిన వెంటనే పరిష్కార దిశగా కృషి చేయాలని నూతన ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

February 20, 2026 / 10:31 AM IST

సోమందేపల్లిలో 2వ రోజు సెహరీ కార్యక్రమం

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో పవిత్ర రంజాన్ మాసంలో రెండవ రోజు ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో శుక్రవారం సహెరీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉపవాస దీక్షను ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు పెంపొందించుకోవాలని మత పెద్దలు సూచించారు.

February 20, 2026 / 10:30 AM IST

రైల్వే బ్రిడ్జిలో ఇరుకున్న లారీ

విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ సమీప రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీ లారీ బ్రిడ్జ్‌ను ఢీకొని ఇరుక్కుపోయింది. అధిక ఎత్తుతో లోడ్ తీసుకెళ్తూ డ్రైవర్ ఎత్తు పరిమితి గమనించకపోవడంతో లారీ పైభాగం గర్డర్‌ను తాకింది. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు.

February 20, 2026 / 10:30 AM IST

తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ

VKB: తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరిగిందని కమిటి ఛైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. తాండూరు మార్కెట్ కమిటికి రాజీనామా చేసిన పట్లోళ్ల బాల్ రెడ్డి గురువారం కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రూ. 29 కోట్లతో 100 షాపులు, కవర్ షెడ్లు, సీసీ రోడ్లు, ప్రహారి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

February 20, 2026 / 10:29 AM IST

‘పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి’

NGKL: పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 14 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పీఎం శ్రీ స్కూల్స్ పథకం కింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న 22 యూనిట్ల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 20, 2026 / 10:29 AM IST

జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థినుల జోరు

NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మానించారు. పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు.

February 20, 2026 / 10:29 AM IST

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు

BDK: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఎన్ కౌంటర్ జరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. దండకారణ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపారు.

February 20, 2026 / 10:27 AM IST

‘చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలి’

SDPT: జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో నిండుకున్న డ్రైనేజీలను మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య పారిశుద్ధ్య కార్మికులచే క్లీన్ చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ఈ మేరకు కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 10:26 AM IST