AP: పాఠశాల విద్యాశాఖ రేపు టెట్-2025 అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి https://tet2dsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.