AP: నీట్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2025-26 విద్యా సంవత్సరంలో MBBS ప్రవేశాల్లో 60.72 శాతం సీట్లు అమ్మాయిలకే దక్కాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి అమ్మాయిల ప్రవేశాలు 3.66 శాతం పెరిగాయి. NTR ఆరోగ్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాల ప్రక్రియ ముగిసింది.