రూ.2000 నోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో తిరిగి చేరలేదని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికీ రూ. 5,817 కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణిలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ నోట్లను దేశంలోని 19 ఆర్బీఐ ఆఫీసుల్లో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించింది. లేకపోతే ఏ పోస్టాఫీసు నుంచైనా.. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని చెప్పింది.