ఏడాదిలోనే IPL బ్రాండ్ వాల్యూ 20% పడిపోయినట్లు బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టులో వెల్లడైంది. 2024లో $12 బిలియన్లుగా ఉన్న IPL వాల్యూ.. 2025 నాటికి $9.6Bకి పతనమైంది. అటు ఫ్రాంచైజీల పరంగా $108 మిలియన్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. RCB($105M), CSK($93M) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నాయి. స్ట్రాంగెస్ట్ IPL ఫ్రాంచైజీలుగా CSK(92.6), RCB(89.5), MI(85) టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి.