హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రూ.250 తగ్గి రూ.1,19,350 పలుకుతోంది. వెండి రేటులో మాత్రం మార్పు లేదు. కేజీ వెండి రూ.1,96,000 వద్దే స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.