TG: రాష్ట్ర నిరుద్యోగులకు TSLPRB శుభవార్త చెప్పింది. 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లేబొరేటరీ టెక్నీషియన్, లేబొరేటరీ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 17 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం https://www.tgprb.inచూడండి.