ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.