TG: పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 100 మార్కులతో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది.. 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. కాగా, ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది.