భారతీయ సంస్కృతిలో పెళ్లిది విశేష స్థానం. తమ జీవితంలో జరిగే ఈ ప్రత్యేకమైన సందర్భం కోసం శక్తికి మించి ఖర్చు చేస్తుంటారు. అయితే రానున్నపెళ్లిళ్ల సీజన్ నవంబర్-డిసెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 48లక్షల వివాహాలు జరగనున్నట్లు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు రూ.6లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు పేర్కొంది. ఆ సమయంలో వస్తువులు, సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.