రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీకి దాదాపు 100 ఏళ్లపాటు పాడుకాకుండా ఉండే పటోళ్ల చీర అంటే ఎంతో ఇష్టమట. పటోలా చీరలను గుజరాత్లోని పటాన్ ప్రాంతంలో తయారు చేస్తారు. చేనేత కార్మికులు ఈ చీరలను స్వయంగా నేస్తారట. 10 నుంచి 12 మంది చేనేత కళాకారులు కనీసం 6 నెలలు కష్టపడి ఈ చేర నేస్తారు. భారతీయ సంప్రదాయ వస్త్ర పరిశ్రమకు చిహ్నంగా నిలుస్తున్న ఈ చీరలు 100 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటాయని సమాచారం.