‘టాటా’ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. సదరు కంపెనీ 125CC బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, 90KM మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మొద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.