ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల ధోరణిలో ట్రేడింగ్ జరగడంతో సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 84 పాయింట్ల లాభంతో ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్కు బలాన్ని ఇచ్చింది.