చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో ఎక్స్300 సిరీస్లో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. అక్టోబర్లో ఈ ఫోన్లను చైనాలో విడుదల చేసిన కంపెనీ.. తాజాగా భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్స్300, ఎక్స్300 ప్రో పేరిట రెండు మోడళ్లను విడుదల చేసింది. వీటి ధర రూ. 76,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.