క్విక్ కామర్స్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవలపై పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో బ్యూటీ&పర్సనల్ కేర్ కంపెనీ నైకా, డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్ లిషియస్ ఈ విభాగంలో అడుగుపెట్టాయి. ముంబైలో 10నిమిషాల్లో డెలివరీ పైలట్ ప్రాజెక్టును నైకా.. గురుగ్రామ్‌లో 15 నిమిషాల్లో డెలివరీలను లిషియస్ పరీక్షిస్తున్నాయి. ఫ్యాషన్ ఫ్లాట్‌ఫామ్ మింత్రా ఢిల్లీ సహా 4 నగరాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.