ఐఫోన్ యూజర్లకు కేంద్రం హై రిస్క్ హెచ్చరికలను జారీ చేసింది. IOS, ఐపాడ్, మ్యాక్, వాచ్, విజన్ OSలలో భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వెంటనే IOS 18, 17.7కు ముందు ఉన్న వెర్షన్లు, ఐపాడ్ OS 18,17.7, మ్యాక్ OS సోనోమాలో 14.7, వెంచురాలో 13.7, సీక్వోయాలో 15, TV OS 18, వాచ్ OS 11, సపారీలో 18, X కోడ్లో 16, విజన్ OSలో 2కు ముందు ఉన్న వెర్షన్లను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.