సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలం అశోక్ దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక లారీ క్యాబిన్లోకి మరొకటి చొచ్చుకుపోవడంతో, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు జేసీబీ సాయంతో తొలగించి పరిస్థితిని చక్కదిద్దారు.