కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. శివకుమార్ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. మైసూరు నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.