NGKL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరుగుతున్న అండర్-14 క్రికెట్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. పాలమూరు జట్టు వరంగల్, అదిలాబాద్, మెదక్ జట్లపై వరుస విజయాలు సాధించినట్లు కోచ్ సురేశ్ తెలిపారు. జిల్లా జట్టు సెమీస్ చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.