నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 100 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ మార్కెట్కు నైజర్ నదిలో పడవపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘటన సమయంలో పడవలో సుమారు 200 మంది ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.