AP: కడప హరిత ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర, కర్ణాటక బార్డర్లోని మంచినీళ్లకోట వద్ద డివైడర్ని ఢీకొట్టి.. బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు.