దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోగా.. మరో 14 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.