కరెంట్ వైర్లకు తగిలి విమానం కూలిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లాలో జరిగింది. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో 33KV హైటెన్షన్ తీగలకు తగిలి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.