SRPT: మేకలను కాపాడేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బాలాజీ నగర్ లోని ఎన్ఎస్పీ కాలువలో పడిన మేకలను కాపాడేందుకు వెళ్లిన పెంటయ్య అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.