ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటనలో మృతి చెందే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పరిమితికి మించి ఎక్కువ మందిని పడవలోకి ఎక్కించటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.