ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆఫీస్ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగి 17 మంది మృతి చెందారు. చాలా మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టాయి.