TG: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కొడుకు, కూతురు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.