HYD: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై సంజయ్ సవంత్(58) గుండె పోటుతో మృతి చచెందారు. బుధవారం అబ్దుల్లాపూర్ మెట్లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండడంతో మంగళవారం రాత్రి అయన పోలీస్ స్టేషన్లో నిద్రించారు. ఈ క్రమంలో ఆయనకు గుండె పోటు రావడంతో అక్కడికడే ప్రాణాలు విడిచాడు. కాగా, SI నాచారంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.