AP: చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్గా పోలీసులు గుర్తించారు.