HYD: ఘట్కేసర్ మండల పరిధి అన్నోజిగూడలోని గ్యాస్ వెల్డింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్న గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో వంట చేసుకుంటున్న కార్మికుడు రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.