AP: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలంలోని అగరాలలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శబరిమల నుంచి కోడూరు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.