ATP: చట్టాన్ని కళ్లుగప్పి 35 ఏళ్లుగా తిరుగుతున్న ఒక రాబరీ కేసులోని నిందితుడు నరసింహులును అనంతపురం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 1992లో కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సును అడ్డగించి దోపిడీ చేసిన కేసులో ఇతను నిందితుడు. బెయిల్పై విడుదలైన తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి అతడిని పట్టుకున్న పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు.