MNCL: మందమర్రి మండలం సన్రోన్ పల్లిలో సొంత తమ్ముడు తన అన్నను రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అన్నదమ్ములైన గోపాల్, కుమార్ మధ్య ఇటీవల కుటుంబ కలహాలు చెలరేగాయి. ఈ క్రమంలో నిందితుడైన కుమార్ ఆగ్రహంతో రోకలి బండ తో గోపాల్ను తల మీద కొట్టి హత్య చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.