SKLM: ఆమదాలవలస కుద్దిరాం గ్రామానికి చెందిన బి.అనంతరావు(50)భవాని దీక్షలో పాము కాటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవార పొలానికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంకి వెళ్లి చూసేసరికి పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా పాముకాటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI వెంకటేష్ తెలిపారు.