AP: ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో నివాసం ఉంటున్న నరేంద్ర, చరణ్ మామిడితోటలో పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తమ్ముడు చరణ్ కాలుజారి నీటిలో పడగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన అన్న కూడా మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.