TPT: సూళ్లూరుపేట హోలీ క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేటకు వెళ్లేందుకు హైవే పైకి వస్తున్న కారును చెన్నై నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఓ పక్క జోరున వర్షం కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.