TG: మెదక్ జిల్లాలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం (40) మంజుల (35) భార్యాభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భర్త ఉరేసుకున్నాడు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.