EG: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి సమీపంలో లక్ష్మీదేవిలంక వద్ద 216 జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని అమలాపురం కిమ్స్ వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడన్నారు. మృతుడు ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ టానెలంక గ్రామానికి చెందిన అద్దంకి అప్పారావుగా పోలీసులు గుర్తించారు.