ASR: కొయ్యూరు మండలంలోని చింతలపూడి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొయ్యూరు నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన రహదారిలో చింతలపూడి గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలించారు.