హైదరాబాద్: 28°C
వార్తలు

భవానీసాగర్‌ నుంచి దుబాయ్‌కి ఛార్జీ రూ.10 వేలు!

TNలోని భవానీసాగర్ నుంచి దుబాయ్‌కి ఓ బస్సు కండక్టర్ రూ.10వేల టికెట్ ఇవ్వడం సంచలనంగా మారింది. హోసూర్ వెళ్ళడానికి బస్సెక్కిన దామోదరన్ అనే ప్రయాణికుడికి కండక్టర్ పొరపాటున ఈ టికెట్ ఇచ్చారు. దీంతో షాకైన ప్రయాణికుడు ఆ టికెట్‌ను నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, టికెటింగ్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య వల్లే ఇలా జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు.