హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలల బాగు కోసం బండి సంజయ్ కీలక పిలుపు

TG: ఈ నెల 15న స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రేపు 'టిఫిన్ బైఠక్' నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జూన్ 13న 'స్వచ్ఛ పాఠశాల' పేరిట స్కూళ్లను క్లీన్ చేస్తామని, 16న 'బడిబాట' ద్వారా పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.