హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన జాన్ వెస్లీ

TG: హైడ్రాను జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చుతూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి క్రూర నరహంతకుడిని స్ఫూర్తిగా తీసుకుంటామనడం అభ్యంతరకరమన్నారు. అంతర్జాతీయ విషయాలపై సీఎం అవగాహన లోపానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని, బాధ్యతారహితంగా మాట్లాడినందుకు ఆయన ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.