హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగులారా అప్రమత్తంగా ఉండండి: ఆర్టీసీ ఎండీ

TG: ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్ల చేతిలో చిక్కి నట్టేట మునగవద్దని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి నిరుద్యోగులకు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలన్నీ పూర్తి పారదర్శకంగా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.