హైదరాబాద్: 28°C
వార్తలు

కువైట్ పాలకులకు మోదీ ఫోన్

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ కువైట్ పాలకులకు ఫోన్ చేశారు. కువైట్ యువరాజు షేక్ మెషల్ అల అహ్మద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ దేశంపై ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. అక్కడి భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం దౌత్య పరిష్కారాలు కనుగొనాలని మోదీ పిలుపునిచ్చారు.