హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టణంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

PLD: చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ వద్ద మంగళవారం అర్బన్ ఎస్సై హజరత్తయ్య ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ రమేష్ ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని ఎస్సై సూచించారు.