హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇండికేటర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి'

ప్రకాశం: గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య ఆటోడ్రైవర్లకు మంగళవారం సూచనలు చేశారు. మూలమలుపులు తిరిగేటప్పుడు తప్పనిసరిగా ఇండికేటర్లు ఉపయోగించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో వాటి నివారణకు ఆటో డ్రైవర్లు కృషి చేయాలని, తమ వద్ద ఆటో సంబంధిత ధ్రువ పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.