హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: యువకుల మానవత్వం.. మూగజీవికి చికిత్స

KKD: తుని పట్టణంలోని కొత్తపేట సమితి ఆఫీస్ వీధిలో ఓ ఆవు అనారోగ్యంతో బాధపడుతూ కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు సాగర్, ప్రకాశ్‌లు వెంటనే స్పందించి, పశువైద్యుడిని సంఘటనా స్థలానికి పిలిపించారు. వైద్యుల సూచనల మేరకు ఆవుకు అవసరమైన చికిత్స అందించి, సెలైన్ బాటిల్ ఎక్కించారు. సకాలంలో వైద్య సహాయం అందడంతో ఆ మూగజీవి కోలుకుంది.