హైదరాబాద్: 28°C
వార్తలు

'భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు కృషి'

సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో నూతన ఎస్‌డీసీ (KRRC) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పి. విజయకుమారి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నిర్దేశిత ప్రాజెక్టులు, రెవెన్యూ పరమైన భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సేవలందిస్తానని తెలిపారు.