హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షం.. ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరిన నీరు

HYD: హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నియోజకవర్గం అంబేద్కర్ నగర్‌లో కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరగంట వర్షానికే బస్తీ జలమయమవ్వడంతో, రానున్న వర్షాకాలంలో తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.