హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు హిరమండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

SKLM: హిరమండలంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ఓ కళ్యాణ మండపంలో జరిగే మండల స్థాయి కార్యకర్తల సమావేశం, SIR వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. అనంతరం ఎమ్మెల్యే తన కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.